ఆది దేవుడు వినాయకుడి విగ్రహాల నిమజ్జనోత్సవ సందడి రెండోరోజు గురువారం కూడా
కొనసాగింది. నిమజ్జనం మొదటి రోజైన బుధవారం నాటి పరిస్థితే కన్పించింది. జై
బోలో గణేష్ మహారాజ్‌కీ.. జై నినాదాలతో హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాలు
అర్ధరాత్రి వరకూ మారుమోగాయి. ముఖ్యంగా నిమజ్జనం మొదటి రోజైన బుధవారం
సాయంత్రం నగరంలో భారీ వర్షం కురవటంతో నిమజ్జన ఊరేగింపుల ఏర్పాట్లకు తీవ్ర
స్థాయిలో అడ్డంకులెదురుకావటంతో గురువారం కూడా నిమజ్జనం జరపాల్సి వచ్చింది.
కానీ పోలీసులు ముందుగా చెప్పిన విధంగానే ఈ సారి ఖైరతాబాద్ వినాయకుడి
నిమజ్జనం చాలా ఆలస్యమైంది. బుధవారం రాత్రి 2.50 గంటల సమయంలో కదిలిన భారీ
గణపయ్య ఊరేగింపు వినాయకసాగర్ వరకు సుమారు 12 గంటల పాటు కొనసాగింది.
ఎట్టకేలకు గురువారం మధ్యాహ్నం 1గం.55 నిమిషాలకు నిమజ్జనం చేశారు.
Continue Reading Story Andhra Bhoomi ePaper
Continue Reading Story Andhra Bhoomi ePaper
No comments:
Post a Comment