‘తెలంగాణ ఉద్యమంలో న్యాయం ఉంది, ధర్మం ఉంది. ఉద్యమానికో లక్ష్యం ఉంది. ఆంధ్రోళ్లంతా ఏకమై తెలంగాణను అడ్డుకోవాలని చూస్తున్నారు. లక్షమంది కిరణ్, బాబు, జగన్‌లు ఏకమై వచ్చినా తెలంగాణను అడ్డుకోలేరు’ అని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన సంపూర్ణ తెలంగాణకు తప్ప, మరే ప్రత్యామ్నాయానికీ అంగీకరించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను కేంద్రపాలితం చేసినా, ఉమ్మడి రాజధాని చేసినా, మరే కిరికిరిలు పెట్టినా మరో ఉద్యమానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉండాలని కెసిఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల ఐకాస (టిజెఎసి) ఆధ్వర్యంలో నిజాం కాలేజీ మైదానంలో ఆదివారం నిర్వహించిన ‘సకల జనభేరీ‘ బహిరంగ సభను ఉద్దేశించి కెసిఆర్ మాట్లాడారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తోన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై కెసిఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Continue Reading Story Andhra Bhoomi
Continue Reading Story Andhra Bhoomi
No comments:
Post a Comment