రాష్ట్రం ఎట్టిపరిస్థితిలో వీడిపోదని సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం
చేస్తామని ఎపి ఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు అశోక్బాబు స్పష్టం చేశారు.
కృష్ణాజిల్లా విజయవాడలో స్వరాజ్య మైదానంలో కామ్రెడ్ పుచ్చలపల్లి సుందరయ్య
వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' కార్యక్రమంలో ఆయన
మాట్లాడారు. ఈ సందర్భంగా భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా సభకు
హాజరైన లక్షలాది మంది ప్రజలను ఉద్దేశించి ఆయన క్లుప్తంగా మాట్లాడారు. ఎన్నో
వ్యయప్రయాసలకోర్చి హైదరాబాద్లో సభ నిర్వహించామనీ ఇప్పుడు విజయవాడ సభను
చూసిన తర్వాత రాష్ట్రం వీడిపోదనే నమ్మకం తనకు కలిగిందన్నారు. విజయవాడలో
జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభ ప్రపంచ చరిత్రలో స్థిరస్థాయిగా
నిలబడిపోయే ఘట్టమని పేర్కొన్నారు.
For More information on this story, please visit Vaartha ePaper
For More information on this story, please visit Vaartha ePaper
No comments:
Post a Comment