Header Navigation

Wednesday, October 23, 2013

అబ్బో..! 150 కేజీల బరువా?

Hero Prabhas
ప్రస్తుతం ప్రభాస్ ఓ తపస్సులా భావించి చేస్తున్న సినిమా ‘బాహుబలి’. ‘ఛత్రపతి’ తర్వాత రాజమౌళితో ఆయన చేస్తున్న సినిమా ఇది. ఈతరం హీరోల్లో జానపదం చేసే అపూర్వఅవకాశం ప్రభాస్‌కే దక్కింది. ఈ జానపదంతో అన్ని వయసుల వారికీ ప్రభాస్ మరింత చేరువవుతారనడంలో ఏ మాత్రం సందేహం లేదు.  కెరీర్ కోసం సాటి హీరోలందరూ బరువు తగ్గుతుంటే... ఏకంగా ‘బాహుబలి’ కోసం 150 కిలోల బరువుకు చేరుకున్నారట ప్రభాస్. ఈ వార్త తెలిసి పరిశ్రమలో అందరూ ‘వావ్’ అంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. కథ రీత్యా ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే తండ్రి పాత్ర పేరు ‘బాహుబలి’ అని తెలిసింది.

Continue Reading Story  Sakshi ePaper