Header Navigation

Friday, October 18, 2013

Break Strike

ఉద్యోగ నేతలతో కిరణ్ చర్చలు సఫలం నేటి నుంచి విధుల్లోకి ఏపీఎన్జీవోలు 66 రోజుల సుదీర్ఘ సమ్మెకు తెర (హైదరాబాద్) సుదీర్ఘ సమ్మెకు తెరపడింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ 66 రోజులుగా సమ్మె చేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు 'తాత్కాలికంగా' తమ సమ్మెను విరమించుకున్నారు. ఇప్పటికే టీచర్లు, విద్యుత్ ఉద్యోగులు సమ్మె విరమించుకోగా... ఇప్పుడు ఏపీఎన్జీవోలు కూడా సమ్మెకు విరామం ప్రకటించారు. శుక్రవారం నుంచి విధులకు హాజరయ్యేందుకు అంగీకరించారు. దీంతో... ఆగస్టు 13వ తేదీ నుంచి సీమాంధ్రలో స్తంభించిన పాలన తిరిగి ప్రారంభం కానుంది. గురువారం ముఖ్యమంత్రి కిరణ్, మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, ఇతర ఉద్యోగ నేతలతో చర్చలు జరిపారు. సమ్మెను పూర్తిగా విరమించేది లేదని... అసెంబ్లీకి తీర్మానం వచ్చేదాకా తాత్కాలికంగా మాత్రమే నిలిపివేస్తామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రితో భేటీ ముగిసిన తర్వాత అశోక్‌బాబు మీడియాతో మాట్లాడారు.

To read full story, please visit Andhra Jyothy Online Newspaper