కాశ్మీర్ లోయలోని నియంత్రణ రేఖ వెంబడి గల కెరన్ సెక్టార్లో పెద్ద ఎత్తున
తుపాకులు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మిలిటెంట్ల
ఏరివేతలో భాగంగా నిర్వహించిన కూంబింగ్‌లో ఇవి దొరికాయని బ్రిగేడియర్ జనరల్
స్ట్ఫా (బిజిఎస్) ఉన్నతాధికారి సంజయ్ మిత్రా సోమవారం విలేఖరులకు తెలిపారు.
ఏడు ఏకె 47 రైఫిల్స్‌తోపాటు నాలుగు పిస్టళ్లు, ఒక స్నిపర్ రైఫిల్, 20
యుబిజిఎల్ గ్రెనైడ్లు, రెండు రేడియో సెట్లు, మరికొన్ని వస్తువులు వీటిలో
ఉన్నాయని చెప్పారు. ఆహార పదార్థాలు, కొన్ని రకాల మందులు కూడా ఉన్నాయని ఆయన
అన్నారు. కాగా, ఇదే సెక్టార్లో ఆదివారం జరిపిన సోదాల్లో ఆరు ఏకె రైఫిళ్లు,
10 పిస్టళ్లు, ఐదు రేడియో సెట్లు, ఇతర వస్తువులను సైన్యం స్వాధీనం
చేసుకున్నట్లు మిత్రా తెలిపారు.
To read full story, please visit Andhra Bhoomi Newspaper
To read full story, please visit Andhra Bhoomi Newspaper
No comments:
Post a Comment