పెను తుఫాను ముంచుకొస్తోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలతో విరుచుకుపడే ప్రమాదం కనిపిస్తోంది. తుఫాను ప్రభావంతో కోస్తాంధ్రలోని తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. అందులోనూ ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లా తీరాన్ని తుఫాను వణికించే ప్రమాదం కనిపిస్తోంది. ఈ తుఫాను దెబ్బకు అంతకుముందుగానే ఏర్పడిన అల్పపీడన ద్రోణి మరింత చురుగ్గా కదులుతూ రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిపిస్తోంది. నిజానికి... ఈ తుఫాను వాయుగుండంగా ఉండగానే బుధవారం మధ్యాహ్నం అండమాన్ దీవుల్లోని మాయాబందర్ వద్ద తీరం దాటింది. ఆ తర్వాత తిరిగి సముద్రంలో ప్రవేశించి బుధవారం సాయంత్రానికే తుఫానుగా మారింది. దీనికి 'ఫైలిన్' అని పేరు పెట్టారు. ఈ తుఫాను శనివారం రాత్రికి ఉత్తర కోస్తాలోని కళింగపట్నం, ఒడిసాలోని పారాదీప్ల మధ్య తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. "తుఫాను తీరం దాటే సమయంలో తీరంలో గంటకు 175 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తాయి. సముద్రంలో అలలు 10 నుంచి 11 మీటర్ల ఎత్తున ఎగిసిపడే అవకాశం ఉంది. ఇది గురువారం ఉదయానికే పెను తుఫానుగా మారుతుంది'' అని వాతావరణ శాఖ హెచ్చరించింది.
To read full story, please visit Andhra Jyothy
To read full story, please visit Andhra Jyothy
No comments:
Post a Comment