Header Navigation

Friday, October 18, 2013

Five Years .. Joint Capital!

తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని పది సంవత్సరాలు కాకుండా, మూడు నుంచి ఐదు సంవత్సరాల వ్యవధికి మాత్రమే పరిమితం చేయాలని తెలంగాణ రాజకీయ, ప్రజాసంఘాల ఐకాస (టిజెఎసి) డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర విభజనపై అధికారికంగా ఏర్పాటు చేసిన మంత్రుల బృందం (జివోఎం)కు నివేదిక ఇవ్వాలని టిజెఎసి నిర్ణయించింది. మంత్రుల బృందానికి తెలంగాణ ప్రజల తరఫున సమర్పించబోయే నివేదికపై టిజెఎసి స్టీరింగ్ కమిటి గురువారం సమావేశమై కసరత్తు చేసింది. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కాకుండా, తాత్కాలిక రాజధానిగా మాత్రమే బిల్లులో సాంకేతికంగా పేర్కొనాలని డిమాండ్ చేయాలని టిజెఎసి నిర్ణయించింది.

To read full story, please visit Andhra Bhoomi ePaper