ఆ జంట హత్యలు చేయలేదు అది దోపిడీ దొంగల పని నన్ను బెదిరించి నగలు ఒలిపించారు నా భార్యను రక్షించుకునేందుకు ఆ కుటుంబాన్ని బలి చేశాను అపరాధ భావంతో కుమిలిపోతున్నా శాన్వి కేసులో ముద్దాయి రఘువెల్లడి అమెరికా జైలు నుంచి 'ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి'కి ఫోన్ (అమెరికా నుంచి ఫోన్లో ఏబీఎన్‌తో..) శాన్వి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసులో నిందితుడు రఘునందన్ యండమూరి అమెరికాలోని జైలు నుంచి 'ఏబీఎన్-ఆంధ్రజ్యోతి'తో ఆదివారం ఫోన్లో మాట్లాడారు. చిన్నారి శాన్వి, ఆమె నానమ్మ వెన్న సత్యవతిల హత్య కేసులో జైలు కెళ్లిన రఘునందన్ మీడియాతో నేరుగా మాట్లాడటం ఇదే తొలిసారి. శాన్వి కుటుంబసభ్యులకు కొన్ని విషయాలు చెప్పడానికే ఏబీఎన్‌కి ఫోన్ చేసినట్లు రఘునందన్ వెల్లడించారు. శాన్వి, సత్యవతిలను తాను హత్య చేయలేదని, తన కుటుంబాన్ని కాపాడుకోడానికే వారిని బలి చేయాల్సి వచ్చిందని తెలిపారు. కొందరు దోపిడీ దొంగలు తనకు తుపాకీ గురిపెట్టి ఈ పని చేయించారని, గర్భవతి అయిన తన భార్యను కాపాడుకోడానికే తమ పక్క ఫ్లాట్‌లో ఉండే శాన్వి కుటుంబాన్ని వారికి చూపించానని రఘు వివరించారు.
Continue Reading Story Telugu Newspaper
Continue Reading Story Telugu Newspaper
No comments:
Post a Comment