Header Navigation

Monday, October 28, 2013

Sikkoluku Threat

అల్పపీడనం, బలమైన ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలూ అల్లాడిపోతున్నాయి. మరో రెండురోజుల పాటు ఉత్తరాంధ్ర, కోస్తా, సీమ, తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండొచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికలు మరింత బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర ఒణికిపోతోంది. ఉభయ గోదావరి ముంపునుంచి తేరుకోలేకపోతోంది. ఇటు సీమ జిల్లాలనూ భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి, బహుదా, మహేంద్రతనయ, సీమలో పెన్నా, కుందూ, పాపాగ్ని నదులు పోటెత్తి ఊళ్లమీద పడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో రిజర్వాయర్లు కంటిమీద కనుకులేకుండా చేస్తున్నాయి.

Continue Reading Story Andhra Bhoomi Newspaper