Header Navigation

Friday, October 4, 2013

Telangana Lainkliyar

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్‌ను విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే మంత్రివర్గం సమావేశానంతరం విలేఖరులతో చెప్పారు. ప్రధాన మంత్రి మన్మోహన్ అధ్యక్షతన గురువారం సాయంత్రం జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైదరాబాదు రాజధానిగా పది జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఇందుకు సంబంధించిన బిల్లు నవంబర్ మొదటి వారంలో రాష్ట్ర శాసనసభలో చర్చకు వస్తుంది. తెలంగాణ బిల్లును మాత్రమే శాసనసభలో చర్చకు పంపించాలని సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయించింది.

For More information on this story, please visit Andhra Bhoomi Newspaper