ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. సీమాంధ్రలో సాగుతున్న ఉద్యమంలో క్రమేపీ హింసాత్మక సంఘటనలు పెరగడం, ఉద్యోగులు, విద్యుత్ సిబ్బంది సమ్మె, స్థానిక రైళ్లతో పాటు అంతర్రాష్ట్ర సర్వీసులకు అంతరాయం కలగడంతో పరిస్థితి నానాటికీ దిగజారుతోందని ఢిల్లీ సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మన్మోహన్ సోమవారం జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, ఆర్థిక మంత్రి చిదంబరంలను పిలిపించుకుని చర్చించారు. ఈ సమావేశంలో హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి కూడా పాల్గొన్నారు. షిండే రెండు సార్లు ప్రధానితో సమావేశమయ్యారు. రాజీనామాల గురించి చర్చించడానికి వచ్చిన సీమాంధ్ర కేంద్ర మంత్రుల సమక్షంలో మొదటిసారి, తర్వాత మరోసారి ఆయన మన్మోహన్ను కలుసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో పరిస్థితి విషమిస్తోందని ఆయన ప్రధానికి వివరించారు. సీమాంధ్రలో పరిస్థితిని చక్కదిద్దే విషయంలో రాష్ట్ర పోలీసులు కూడా సహకరించడం లేదని ఆయన నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే తాము తగినన్ని బలగాల్ని పంపామని కూడా ఆయన పేర్కొన్నారు.
For More information on this story, please visit Andhra Jyothy Telugu Newspaper
For More information on this story, please visit Andhra Jyothy Telugu Newspaper
ఆంధ్రప్రదేశ్లో
నెలకొన్న పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. సీమాంధ్రలో
సాగుతున్న ఉద్యమంలో క్రమేపీ హింసాత్మక సంఘటనలు పెరగడం, ఉద్యోగులు, విద్యుత్
సిబ్బంది సమ్మె, స్థానిక రైళ్లతో పాటు అంతర్రాష్ట్ర సర్వీసులకు అంతరాయం
కలగడంతో పరిస్థితి నానాటికీ దిగజారుతోందని ఢిల్లీ సర్కారు భావిస్తోంది. ఈ
నేపథ్యంలోనే ప్రధాని మన్మోహన్ సోమవారం జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్
మీనన్, కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, ఆర్థిక మంత్రి చిదంబరంలను
పిలిపించుకుని చర్చించారు. ఈ సమావేశంలో హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి
కూడా పాల్గొన్నారు. షిండే రెండు సార్లు ప్రధానితో సమావేశమయ్యారు. రాజీనామాల
గురించి చర్చించడానికి వచ్చిన సీమాంధ్ర కేంద్ర మంత్రుల సమక్షంలో
మొదటిసారి, తర్వాత మరోసారి ఆయన మన్మోహన్ను కలుసుకున్నారు. విశ్వసనీయ
వర్గాల సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో పరిస్థితి విషమిస్తోందని ఆయన
ప్రధానికి వివరించారు. సీమాంధ్రలో పరిస్థితిని చక్కదిద్దే విషయంలో రాష్ట్ర
పోలీసులు కూడా సహకరించడం లేదని ఆయన నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే
తాము తగినన్ని బలగాల్ని పంపామని కూడా ఆయన పేర్కొన్నారు. - See more at:
http://www.andhrajyothy.com/node/8538#sthash.ltdktdOX.dpuf
No comments:
Post a Comment