
రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అడుగులు వేగంగా పడుతున్నప్పటికీ, హైదరాబాద్ యుటి, రాయల తెలంగాణ, 371 డి తొలగింపు తదితర అంశాలపై వస్తున్న వత్తిడులను అధిగమించేందుకు కఠిననిర్ణయాలు తీసుకునేందుకు అధినేత్రి సోనియా సన్నద్ధమయ్యారని తెలుస్తోంది. అనుకున్న సమయానికి పార్లమెంట్లో విభజన బిల్లు ప్రవేశపెట్టాలనే లక్ష్యంతో జిఒఎం వేగవంతంగా కసరత్తు చేస్తున్నప్పటికీ, కేబినెట్‌కు అందించే నోట్‌పై తుది నిర్ణయానికి రాలేకపోతోంది. సోమవారం జరిగే కేబినెట్ భేటీకి కూడా సిఫార్సుల నివేదికను అందించే పరిస్థితిలో కేంద్ర మంత్రుల బృందం లేదు. దీంతో కేబినెట్ అజెండాలో కూడా ఆ విషయాన్ని పొందుపరచలేదని తెలిసింది. అయితే, రెండు రోజులుగా రాయల తెలంగాణపై జిఒఎం మొగ్గుచూపుతుందని ప్రచారంజోరందుకుంది.
To read full story, please visit
Vaartha ePaper
No comments:
Post a Comment