ఢిల్లీలో పదిహేనేళ్ల కాంగ్రెస్ పాలనకు తెరపడింది. ప్రభుత్వ వ్యతిరేకపవనాలు బలంగా వీయడంతో కాంగ్రెస్పార్టీ తుడుచుపెట్టుకుపోయింది. గత మూడు ఎన్నికల్లోనూ ప్రతిపక్షంగా మిగిలిపోయిన బీజేపీ ఈసారి అతిపెద్ద పార్టీగా అవతరించింది. 31 స్థానాలను దక్కించుకుని ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు మొదలు పెట్టింది. బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాలీ దళ్ ఒక స్థానంలో విజయం సాధించింది. దీంతో సాధారణ మెజారిటీకి బీజేపీ నాలుగడుగుల దూరంలో నిలిచిపోయింది. కాగా ఈ ఎన్నికల్లో అరవింద్ కేస్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన విజయం నమోదు చేసింది. అవినీతిని తుడిచేస్తామంటూ ఎన్నికల బరిలో దూకిన ఈ పార్టీ.. తొలి ఎన్నికల్లోనే 28 స్థానాలను కైవసం చేసుకుని గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ విజయఢంకా మోగించింది.
For More information on this story, please visit Andhra Jyothy
For More information on this story, please visit Andhra Jyothy
No comments:
Post a Comment