గ్రేహౌండ్స్ ఐజీ సీతారామాంజనేయులు తనను హత్య చేయించేందుకు పథకం రచిస్తున్నారని విజయవాడ టీడీపీ నేత వల్లభనేని వంశీ సంచలన ఆరోపణ చేశారు. ఐజీ నుంచి తనకు ప్రాణహాని ఉందని డీజీపీ ప్రసాదరావుకు ఫిర్యాదు చేశారు. మాజీ నక్సలైట్లతో తనను హత్య చేయించేందుకు సీతారామాంజనేయులు పన్నిన కుట్రకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. మాజీ నక్సలైట్ వివరాలు డీజీపీకి తెలియజేశానని, ఆయన సూచన మేరకు విజయవాడ పోలీస్ కమిషనర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు.
For More information on this story, please visit Andhra Jyothy ePaper
For More information on this story, please visit Andhra Jyothy ePaper