Header Navigation

Thursday, February 13, 2014

ఇదో సాఫ్ట్‌‘వేరే’ స్టోరీ!

తరచుగానే చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. పెళ్లి చేసుకోమంటూ ఓ యువతి చేసిన వేధింపులకు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే. ఈ ఉదంతం మహారాష్ట్రలోని పుణేలో ఉన్న యరవాడలో చోటు చేసుకుంది. యువతిది హైదరాబాద్‌గా తేలింది. యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి స్థాయిలో నిర్ధారణ అయితే తప్ప యువతి పేరు, ఇతర వివరాలు వెల్లడించమని యరవాడ ఠాణా సీనియర్ ఇన్‌స్పెక్టర్ కిషోర్ జాదవ్ ‘సాక్షి’కి బుధవారం ఫోన్‌లో చెప్పారు.

For More Today's Latest News please visit Sakshi ePaper