పార్లమెంటులో కనీవినీ ఎరుగని అంతర్గత దాడి జరిగింది! తెలుగుజాతి ఐక్యత గురించి.. ఔన్నత్యాన్ని గురించి కంఠశోష పెట్టే సమైక్యవాదులు.. సాక్షాత్తూ ఆ తెలుగుజాతి పరువునే దేశ రాజధాని సాక్షిగా తీసిపారేశారు! యావత్ ప్రపంచం అబ్బురంగా చూసే భారత పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థను అపహాస్యం చేశారు! దారుణంగా పరాభవించారు! నచ్చకపోతే వ్యతిరేకించేందుకు పూర్తి అవకాశం ఉన్నా.. తమ అభీష్టాలను కాదని తెలంగాణ బిల్లును తీసుకువస్తున్నారన్న దుగ్ధతో.. తాము వ్యతిరేకించే అంశాన్ని అడ్డుకునేందుకు భౌతికదాడులను ఆశ్రయించారు! ఈ క్రమంలోనే రౌడీ అవతారం ఎత్తిన కొందరు పెట్టుబడిదారీ పార్లమెంటు సభ్యులు.. తెలంగాణ ఆకాంక్షను చివరిక్షణంలోనైనా కాలరాయాలని బరితెగించేశారు! తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కల సాకారమవుతున్న అపూర్వ క్షణాలను జీర్ణించుకోలేక.. శివాలెత్తారు!
For More Today's Latest News please visit Telugu ePaper
For More Today's Latest News please visit Telugu ePaper
No comments:
Post a Comment