2013 ఆగస్టు 11వ తేదీ... హైదరాబాద్కు వచ్చిన నరేంద్ర మోదీని తెలుగు సినీ
పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు కలిశారు. కరచాలనాలు చేశారు. ఫొటోలు
దిగారు. అయితే... ఈ భేటీలకు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకోలేదు. ఇదంతా మోదీ
మీద 'క్రేజ్' అని అనుకున్నారు. కానీ... ఇప్పుడు సీన్ మారుతోంది. మోదీపట్ల,
ఆయన ప్రధాని అభ్యర్థిగా ఉన్న బీజేపీ పట్ల టాలీవుడ్ ప్రముఖుల్లో ఆసక్తి
పెరుగుతోంది. మొన్నటికి మొన్న పవన్ కల్యాణ్... నేడు నాగార్జున! రేపు...
మోహన్ బాబు? టాలీవుడ్లో 'న.మో.' జపం చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ
పెరుగుతోంది. నిజానికి... తెలుగు సినీ ప్రముఖుల్లో బీజేపీ వైపు చూసే వారి
సంఖ్య చాలా చాలా తక్కువ.
For More Today's Latest News please visit Andhra Jyothy Daily
For More Today's Latest News please visit Andhra Jyothy Daily