Header Navigation

Friday, March 21, 2014

పవన్ ఆస్తులు 17.77 కోట్లే!

"నా డబ్బులున్న వారు లేరు. ఉన్న డబ్బులు ఈ సమావేశం ఏర్పాటు చేసేందుకే ఖర్చయ్యాయి''... జనసేన పార్టీ ఆవిర్భావ సభ వేదికపై పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన ఇది. దీంతో ఆయన ఆస్తిపాస్తులపై ఇప్పుడు చర్చ మొదలైంది. 'వంద కోట్ల' సినిమా చేయగల ఈ హీరో ప్రస్తుత ఆస్తుల విలువ రూ.17.77 కోట్లు మాత్రమే అని ఒక ఆంగ్ల పత్రిక వెల్లడించింది. ఈ మేరకు పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తుతోపాటు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన 'ఆస్తుల అఫిడవిట్' ఇప్పుడు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యింది. పవన్‌కు సొంత ఇల్లు కూడా లేదని అందులో వెల్లడైంది. అయితే, ఆస్తుల జాబితాలో పవన్ ఫామ్‌హౌస్ లేని విషయాన్ని మరికొందరు గుర్తుచేస్తున్నారు. "టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరో పవన్. ఒక్కో సినిమాకు 13-15 కోట్లు తీసుకుంటారు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper