Header Navigation

Thursday, October 30, 2014

ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం

పెబ్బేరు: ఓ ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి బస్సు బోల్తా కొట్టింది. ప్రయాణికుల అదృష్టం కొద్ది తృటిలో వారు ప్రాణాపాయస్థితినుంచి బయటపడ్డారు. ఆరుమందికి తీవ్ర గాయాలయ్యాయి. సెల్‌ఫోన్లో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వాహనం తోలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి లోనైన ప్రయాణికులు డ్రైవర్‌ను చితకబాదారు. పోలీసులు కేసు నమోదు చేశారు.    

For More Today's Latest News please visit Sakshi  


రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

బెరైడ్డిపల్లె: రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ ప్రయివేటు కళాశాల బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఒక విద్యార్థి మృతిచెందాడు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం పలమనేరు-కుప్పం జాతీయ రహదారిలోని జాలారిపల్లె వద్ద చోటుచేసుకుంది. పలమనేరులోని ఓ కళాశాలకు చెందిన బస్సు ఉదయం విద్యార్థులను తీసుకెళ్లే క్రమంలో జాలారిపల్లె వద్ద రోడ్డు పక్కన ఆగింది. అదే సమయంలో ఇతర పాఠశాల, కళాశాల విద్యార్థులు, ప్రయాణికులతో కుప్పం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేగంగా వస్తూ అదుపు తప్పి కళాశాల బస్సును ఢీకొట్టింది.

For More Today's Latest News please visit Sakshi  

ఎస్ఎంఎస్ తో రైల్వే సమాచారం

రైల్వే ఎంక్వైరీకి ఫోన్ చేసి సరైన సమాచారం పొందలేక ఇబ్బంది పడుతున్నారా? మీరు వెళ్లాలనుకుంటున్న ట్రైన్ పేరు, నంబరు, టైమ్ టేబుల్, టికెట్ ధర, పీఎన్‌ఆర్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే 139 నంబరుకు ఎస్‌ఎమ్మెస్ చేసి సులభంగా సమాచారం పొందవచ్చు. ఎస్సెమ్మెస్ ఎలా చేయాలి? పద్ధతులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.  

For More Today's Latest News please visit Sakshi  

Wednesday, October 29, 2014

రాణా.. త్రిషల మధ్య ఆ రాగిణి ఎవరు?


హైదరాబాద్:  ఎన్నాళ్ల నుంచో స్నేహంగా ఉంటున్న రాణా.. త్రిషలు ఎందుకు విడిపోయారు? వాళ్లిద్దరి మధ్య విభేదాలకు కారణం ఎవరు? అనధికారికంగా వస్తున్న కథనాల ప్రకారం, కన్నడ సుందరి రాగిణీ ద్వివేది కారణంగానే ఇలా జరిగిందని వినిపిస్తోంది. 

For More Today's Latest News please visit Sakshi ePaper  

భార్యతోపాటు కూతుళ్లను చంపి ఆత్మహత్య

లండన్:  ఏం కష్టం వచ్చిందో ఏమో ఓ ఎన్నారై తన భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలను చంపేశాడు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన లండన్ లోని బ్రాడ్ ఫోర్డ్ లో చోటు చేసుకుంది. ఎన్నారై జితేంద్ర లాడ్ (49) తన భార్య దుష్కా లాడ్ (44) ఇద్దరు టీనేజీ కుమార్తెలు త్రిషా (19), నిషా (17)లతో కలసి బ్రాడ్ ఫోర్డ్ నివసిస్తున్నాడు. 

For More Today's Latest News please visit Sakshi  

వ్యభిచార గృహంపై దాడి, యువతుల అరెస్ట్

గుంటూరు: గుంటూరు నగరంలో వ్యభిచారం చాపకింద నీరులా మారింది. ఇటీవలే పోలీసులు వ్యభిచార గృహాలపై దాడులు చేసి పలువురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నగరంలోని రామిరెడ్డివారి తోటలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు.  ఈ సందర్భంగా అండర్ గ్రౌండ్ లో రహస్యంగా నిర్మించిన గదిలో దాగిన యువతులను అదుపులోకి తీసుకున్నారు.

For More Today's Latest News please visit Sakshi  

తల్లితో కలిసి భర్తను చంపేసిన భార్య

హైదరాబాద్వేధిస్తున్న భర్తను తల్లితో కలిసి హతమార్చిందో భార్య. సంతోష్‌నగర్ బన్నికకు చెందిన ఎండీ గౌస్ (24)కు పటాన్‌చెరువు మండలం సుల్తాన్‌పూర్‌కు చెందిన ఫరీదా (21)తో రెండేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి పాప, బాబు ఉన్నారు. ఫరీదా తల్లి ఆజీ బేగం మియాపూర్‌లోని న్యూకాలనీలో ఉంటోంది. అల్లుడు, కూతురు ఈమె వద్దే ఉంటున్నారు. గౌస్ జులాయిగా తిరిగేవాడు. మద్యం, గంజాయి తాగుతూ మైకంలో తరచు భార్యతో గొడవ పడేవాడు. భార్య, అత్తను చంపుతానని మూడు రోజులుగా జేబులో బ్లేడ్ పెట్టుకొని తిరుగుతున్నాడు.

To read full story, please visit Sakshi ePaper

Monday, October 27, 2014

కాటేసిన కరెంట్ తీగలు

గట్టు / తిమ్మాజీపేట: గట్టు మండలం ఆలూరుకు చెందిన కుమ్మరి కిష్టప్ప, మంగమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరికి సమీపంలోనే ఐదెకరాల పొలం ఉంది. అందులో రెండు బో ర్లు వేసి వరి, పత్తి సాగు చే స్తున్నారు. పొలం దగ్గరే గుడిసె వేసుకున్నారు. ఎప్పటిలాగే ఆది వారం ఉదయం అన్నదమ్ములు మహేష్ (20), రాజు, తండ్రి కిష్టప్పతో కలిసి బైక్‌పై తమ పొ లానికి వెళ్లారు. బోరు మోటార్ దగ్గర తండ్రి, త మ్ముడు దిగి పోగా, అన్న మాత్రం వాహనాన్ని కొద్దిదూరంలో ఉన్న గుడిసెలో పెట్టేందుకు వెళ్లాడు.

For More Today's Latest News please visit Sakshi  

రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

చిత్తూరు : చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డి వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఓ గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి బైక్ ను ఢీకొనటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దాంతో బైక్ పై ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.

To read full story, please visit Sakshi ePaper

Wednesday, October 22, 2014

బాణసంచా పేలి ఇద్దరి సజీవ దహనం

భువనగిరి:  నల్లగొండ జిల్లా  భువనగిరిలోని ఆర్బీనగర్‌లో ఓ వ్యాపారి అమ్మకానికి తీసుకువచ్చి దుకాణంలోని టపాసులు పేలి ఇద్దరు సజీవ దహనమయ్యారు. మరొకరు కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. భువనగిరి ఆర్బీ నగర్‌లో వ్యాపారి పెద్ది శ్రీనివాస్ కిరాణ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దీపావళి పండుగ సందర్భంగా విక్రయించేందుకు టపాసులు తీసుకువచ్చి దుకాణంలో ఉంచాడు.

To read full story, please visit Sakshi

1,416 టీచర్ పోస్టులు ఖాళీ

నాగిరెడ్డిపేట : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1,416 ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసాచారి పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలోపు ఈ పోస్టులు భర్తీ కావొచ్చన్నారు. మాల్తుమ్మెద ఉన్నత పాఠశాలలో మంగళవారం పలు పాఠశాలల హెచ్‌ఎంలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. పాఠశాలలోని రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

To read full story, please visit Sakshi

రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి

అనంతపురంఅనంతపురం జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గోరంట్ల మండలం గుమ్మయ్యగారి పల్లె దగ్గర ఆటోను లారీ ఢీ కొట్టింది.ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు.  మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. పెడబల్లికి చెందిన నాగమ్మ, షరీవమ్మ, సుగుణ, వెంకటమ్మ, నాగమణితో పాటు డ్రైవర్ విజయకుమార్ కూడా మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటకలోని సాగేపల్లికి కూరగాయలు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా పెడపల్లి గ్రామానికి చెందినవారు.

To read full story, please visit Sakshi ePaper

Tuesday, October 21, 2014

తల్లిని చంపిన తనయుడు

రంగారెడ్డి : దీపావళి పండుగ వేళ వెలుగులు విరాజిల్లాల్సిన ఆ ఇంట్లో చీకట్లు అలుముకున్నాయి. టపాసుల పండుగకు బైక్ ఇప్పించాలని తనయుడు ఒకటే పోరు. డబ్బులు లేవని తల్లి జవాబు. తల్లిని అర్థం చేసుకోలేని ఓ తనయుడు దారుణానికి ఒడిగట్టాడు. బైక్ ఇప్పించలేదని కక్ష గట్టిన తనయుడు కన్న తల్లినే దారుణంగా చంపాడు. కర్రతో మోది హత్య చేశాడు. ఈ ఘటన వికారాబాద్‌లోని రామయ్యగూడలో చోటు చేసుకుంది. మృతురాలి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
To read full story, please visit Namaste Telangana

రోడ్డు ప్రమాదంలో బాలుడి దుర్మరణం

సాలూరు : పట్టణంలోని గాంధీనగర్ వద్ద సోమ వారం లారీ కింద పడి ఓ బాలుడు దుర్మరణం చెందా డు. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు...పట్టణంలోని పెద్దవీధికి చెందిన చింతగడ శార్వాన్ కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అతని భార్యకి డెంగీ రావడంతో విశాఖలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సోమవారం ఆమెను అక్కడి వైద్యులు డిశ్చార్జి చేయడంతో ఆ  మె తన పిల్లలతో కలిసి పట్టణానికి చేరుకుంది. గాంధీనగర్ వద్ద బస్సు దిగుతుండగా ఆమె నాలుగేళ్ల చిన్న కుమారుడు రిషిత్    మూత్ర విసర్జణ కోసం రోడ్డుకు ఆవలివైపునకు వెళ్లి వేగంగా తల్లి వైపునకు రావడంతో అక్కడే పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహ నాన్ని ఢీకొని లారీ కింద పడ్డారు.

To read full story, please visit Sakshi ePaper

ప్రియుడితో కలసి భర్తను హతమార్చిన భార్య

పత్తికొండ టౌన్అగ్నిసాక్షిగా మూడుముళ్లు వేసిన భర్తను కడతేర్చింది ఓ ఇల్లాలు.  వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. ఆదివారం అర్ధరాత్రి పత్తికొండలో ఇది సంచలనం కలిగించింది.  పత్తికొండ పోలీసులు, మృతుడి బంధువుల కథనం మేరకు..పత్తికొండ పట్టణం ఆదోనిరోడ్డు పెట్రోలు బంకుకు సమీపంలో సవారమ్మ కాలనీకి చెందిన చిట్టెమ్మ, మడ్డిగేరి కాలనీకి చెందినబీటీ దస్తగిరి(30) 9ఏళ్ల క్రితం ప్రేమించుకుని, పెద్దల అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు విజయ్‌కుమార్(7), విజయలక్ష్మి(5) ఉన్నారు.

For More Today's Latest News please visit Sakshi  

ఐదుగురికి యావజ్జీవం

న్యూఢిల్లీ: ఢిల్లీలో సంచలనం సృష్టించిన దౌలాకాన్ గ్యాంగ్‌రేప్ కేసులో స్థానిక కోర్టు సోమవారం ఐదుగురు దోషులకు యూవజ్జీవ కారాగార శిక్ష విధించింది. మిజోరంకు చెందిన ఓ బీపీఓ ఉద్యోగిపై 2010లో జరిగిన సామూహిక అత్యాచారం కేసు విచారణ సందర్భంగా స్థానిక అదనపుసెషన్స్ జడ్జి వీరేందర్ భట్ వీరికి యావజ్జీవ శిక్షతోపాటు ఒక్కొక్కరికీ రూ.50వేల చొప్పున జరిమానా విధించారు. ఈ మెుత్తాన్ని బాధితురాలికి నష్టపరిహారం కింద చెల్లించాలని ఆదేశించారు. అపహరణ, కుట్ర తదితర నేరాల కింద ఏడేళ్లు, ఐదేళ్ల చొప్పున కూడా వీరికి శిక్షలు విధించారు.

To read full story, please visit Sakshi ePaper

పేలుడు ప్రమాదంలో 18కి చేరిన మృతుల సంఖ్య

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో సోమవారం జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరింది.  మృతులలో 14 మంది మహిళలు ఉన్నారు.  ఈ దుర్ఘటనలో నిన్న 12 మంది చనిపోయిన విషయం తెలిసిందే.  కాకినాడ ఆస్పత్రులలో చికిత్స పొందుతూ  మరో ఆరుగురు మృతి చెందారు.  మృతి చెందినవారిలో ఇద్దరిని ఇంకా గుర్తించలేదు.

For More Today's Latest News please visit Sakshi  

Monday, October 20, 2014

ఆఫ్రికన్ యువతిపై అత్యాచారయత్నం

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి సంచలన సంఘటన జరిగింది. చదువుకోడానికి దేశం కాని దేశం వచ్చిన ఆఫ్రికన్ యువతి మీద ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. దాంతో ఆ యువతి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆఫ్రికా ప్రాంతానికి చెందిన యువతి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమెను ఒక యువకుడు గత కొంత కాలంగా బైకుపై వెంటపడి, వేధిస్తున్నాడు.

For More Today's Latest News please visit Sakshi ePaper  

వేధిస్తున్న భర్తను హతమార్చిన భార్య

కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్త వేధింపులు భరించలేని భార్య అతడిని హతమార్చిన  ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. నిద్రిస్తున్న భర్త తలపై బండరాయితో మోది హత్య చేసింది. వివరాల్లోకి వెళితే దస్తగిరి, చిట్టెమ్మలు స్థానికంగా పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. అయితే దస్తగిరి భార్యపై అనుమానంతో నిత్యం చిట్టెమ్మను వేధిస్తుండేవాడు. దాంతో గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇరు కుటుంబాల పెద్దలు నచ్చచెప్పినా ఈ వివాదానికి తెరపడలేదు.


To read full story, please visit Sakshi

కుక్క పిల్లలకు ఘనంగా బారసాల

కరీంనగర్ :  సంతాన భాగ్యం లేని దంపతుల జంట తన పెంపుడు కుక్కకు పుట్టిన పిల్లలకు ఘనంగా బారసాల నిర్వహించారు. వివరాల్లోకి వెళితే కరీం నగర్ జిల్లా వావిలాలపల్లికి చెందిన రవి తన ఇంట్లోని కుక్కంటే ఎనలేని అభిమానం, ప్రేమ. తమకు సంతానం లేని లోటును ఆ కుక్క ద్వారా తీర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ కుక్క ఇటీవలే నాలుగు కూనలకు జన్మనిచ్చింది.

For More Today's Latest News please visit Sakshi ePaper 

Friday, October 17, 2014

మట్టిగోడ కూలి.. విద్యార్థి మృతి 23 మందికి గాయాలు

నోయిడా: ప్రమాదవశాత్తు మట్టిగోడ కూలి పాఠశాలపై పడిన ఘటనలో తొమ్మిదేళ్ల విద్యార్థి మృతి చెందగా, 23 మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన యూపీ పరిధిలోని ఢిల్లీ శివారు ప్రాంతమైన నోయిడాలో గురువారం చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నోయిడా సెక్టార్-49లోని ప్రవీణ్ అనే వ్యక్తికి చెందిన మట్టిగోడ పక్కనే ఉన్న ఆర్‌సీవీ జూనియర్ ఉన్నత పాఠశాలపై కూలిపడింది. ఈ ఘటనలో సందీప్(9)  తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు.

For More Today's Latest News please visit Sakshi

శ్రీజను కలవడానికి ఖమ్మం వెళుతున్నా

రాజమండ్రి : విశాఖలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన శుక్రవారం ఉదయమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో పరిస్థితులు కుదుట పడుతున్నాయన్నారు. హుదూద్ తుఫాను బాధితులకు అందరూ అండగా నిలవాలని నిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో విపత్తు నివారణ వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తుఫాను పునరావాస సహాయక చర్యల్లో సినీ పరిశ్రమ పాలుపంచుకోవటం అభినందనీయమన్నారు. మున్ముందు ఉత్తరాంధ్రలో పునరావాస కార్యక్రమాల్లో జనసేన పాలుపంచుకుంటుందన్నారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

Thursday, October 16, 2014

పెళ్లైన మూడు నెలలకే భార్యను హతమార్చాడు

హైదరాబాద్ : హైదరాబాద్ జీడిమెట్ల శ్రీరామ్ నగర్ లో దారుణం జరిగింది. వరకట్నం వేధింపులకు ఓ గృహిణి బలైంది. అదనపు కట్నం కోసం పెళ్లైన మూడు నెలలకే కట్టుకున్న భార్యను హతమార్చాడో భర్త. అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే శ్రీరామ్ నగర్ కు చెందిన పెయింటర్ ఇజాజ్ కు మెదక్ జిల్లా తండుమూరు గ్రామానికి చెందిన మున్నీసా బేగంతో మూడు నెలల క్రితం వివాహం జరిగింది. 

For More Today's Latest News please visit Sakshi

కారు బాంబు పేలుడు: ఐదుగురు మృతి

సోమాలియా: సోమాలియా రాజధాని మొగదీషులో కారు బాంబు పేలుడులో ఐదుగురు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని చెప్పారు. క్షతగాత్రులు సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు తెలిపారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

Wednesday, October 15, 2014

17న ‘నిర్భయ’ క్షిపణి పరీక్ష

బాలసోర్ : స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సబ్‌సోనిక్ దీర్ఘశ్రేణి క్షిపణి నిర్భయను 17న చాందీపూర్‌లోని టెస్ట్ రేంజ్ కేంద్రంనుంచి పరీక్షిస్తామని డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు తెలిపారు. 2013మార్చి 12న తొలిసారి పరీక్షించినప్పుడు ఇది మధ్యలోనే కూలిపోయింది. 800నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి ఛేదించగలదు.

To read full story, please visit Namaste Telangana

బోరుబావిలో పడిన చిన్నారి మృతి

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి/ ఇబ్రహీంపట్నం/ మంచాల, అక్టోబర్ 14 (టీ మీడియా): రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో ఆదివారం బోరుబావిలో పడిన చిన్నారి గిరిజ మృతి చెందింది. బాలికను కాపాడేందుకు అధికార యంత్రాంగం మూడురోజులపాటు కష్టపడినా ఫలితం లేకుండాపోయింది.

రవాణామంత్రి మహేందర్‌రెడ్డి ఘటనాస్థలానికి వచ్చి, గిరిజ మృతిచెందినట్లు ప్రకటించటంతో ఆమె బంధువులు గుండెలవిసేలా విలపించారు. రాత్రే బాలిక అంత్యక్రియలు నిర్వహించారు. బోరుబావిలో నీరుండటంతో గిరిజ అందులో పడినరోజే ఊపిరాడక మృతి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు.

To read full story, please visit Namaste Telangana ePaper

శాన్వి హత్యకేసులో రఘునందన్

వాషింగ్టన్ : అమెరికా పెన్సిల్వేనియాలో చిన్నారి శాన్వి, సత్యవతి దారుణహత్య కేసులో నిందితుడైన యండమూరి రఘునందన్‌కు అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఈ కేసులో రెండేళ్ళ పాటు విచారణ చేసిన అమెరికా కోర్టు  ఈ నెల తొమ్మిదిన రఘునందన్‌ ను దోషిగా నిర్ధారించిన విషయం తెలిసిందే. చిన్నారి కిడ్నాప్‌, జంటహత్యలు చేసిన రఘునందన్‌కు కోర్టు మరణశిక్ష ఖరారు చేశింది.

For More Today's Latest News please visit Sakshi

హైదరాబాద్‌లో మరో ప్రేమోన్మాది

హైదరాబాద్: ప్రేమోన్మాదుల దాడికి యువతులు బలవుతూనే ఉన్నారు. తనను ప్రేమించడం లేదని సోమవారం ఓ ఉన్మాది రవళిని కత్తితో దాడి చే సిన ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే నగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిపై అనుమానం పెంచుకున్న ప్రియుడు ఆమె పుట్టినరోజు నాడే హతమార్చేందుకు కుట్ర చేశాడు. కేక్ కట్ చేయాలంటూ భవనంపైకి తీసుకెళ్లి అక్కడి నుంచి బలవంతంగా తోసేశాడు. అదృష్టవశాత్తు సిమెంట్ రేకులపై పడడంతో బాధితురాలు ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.

For More Today's Latest News please visit Sakshi ePaper

Monday, October 13, 2014

రవళిపై దాడి చేసిన ప్రదీప్ మృతి

హైదరాబాద్ : ఇంజినీరింగ్ విద్యార్థిని రవళిపై దాడి చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ప్రదీప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.  అరోరా ఇంజినీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న రవళిపై  ఈరోజు ఉదయం ప్రదీప్ వేట కొడవలితో దాడి చేసిన విషయం తెలిసిందే.

For More Today's Latest News please visit Sakshi Newspaper

హీరో గోపీచంద్ కు తండ్రి గా ప్రమోషన్

హైదరాబాద్: యువ హీరో గోపీచంద్ అభిమానులకు శుభవార్త. లౌక్యం చిత్రం ద్వారా కెరీర్లో అత్యుత్తమ విజయం సాధించిన గోపీచంద్ కు  ప్రమోషన్ లభించింది. ప్రస్తుతం గోపీచంద్ నిజజీవితంలో తండ్రి పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యాడు. గోపీచంద్ భార్య రేష్మ సోమవారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని గోపీచంద్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఆ దేవుడు తనను మగబిడ్డతో ఆశీర్వదించాడని తెలిపాడు. తనకు దీవెనలు అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.

For More Today's Latest News please visit Eenadu epaper

రూ.290 కోట్లు దాటిన 'బ్యాంగ్ బ్యాంగ్' వసూళ్లు !

న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ జంటగా  ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో నిర్మించిన 'బ్యాంగ్ బ్యాంగ్' చిత్రం 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 290.97 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో 154.68 కోట్ల రూపాయలు (గ్రాస్ రూ.221 కోట్లు) వసూలు చేసింది.

For More Today's Latest News please visit Sakshi ePaper