Header Navigation

Monday, October 13, 2014

హీరో గోపీచంద్ కు తండ్రి గా ప్రమోషన్

హైదరాబాద్: యువ హీరో గోపీచంద్ అభిమానులకు శుభవార్త. లౌక్యం చిత్రం ద్వారా కెరీర్లో అత్యుత్తమ విజయం సాధించిన గోపీచంద్ కు  ప్రమోషన్ లభించింది. ప్రస్తుతం గోపీచంద్ నిజజీవితంలో తండ్రి పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యాడు. గోపీచంద్ భార్య రేష్మ సోమవారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని గోపీచంద్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఆ దేవుడు తనను మగబిడ్డతో ఆశీర్వదించాడని తెలిపాడు. తనకు దీవెనలు అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.

For More Today's Latest News please visit Eenadu epaper

No comments:

Post a Comment