చిత్తూరు : చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డి వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఓ గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి బైక్ ను ఢీకొనటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దాంతో బైక్ పై ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.
To read full story, please visit Sakshi ePaper
To read full story, please visit Sakshi ePaper
No comments:
Post a Comment