బెరైడ్డిపల్లె: రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ ప్రయివేటు కళాశాల బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఒక విద్యార్థి మృతిచెందాడు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం పలమనేరు-కుప్పం జాతీయ రహదారిలోని జాలారిపల్లె వద్ద చోటుచేసుకుంది. పలమనేరులోని ఓ కళాశాలకు చెందిన బస్సు ఉదయం విద్యార్థులను తీసుకెళ్లే క్రమంలో జాలారిపల్లె వద్ద రోడ్డు పక్కన ఆగింది. అదే సమయంలో ఇతర పాఠశాల, కళాశాల విద్యార్థులు, ప్రయాణికులతో కుప్పం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేగంగా వస్తూ అదుపు తప్పి కళాశాల బస్సును ఢీకొట్టింది.
For More Today's Latest News please visit Sakshi
For More Today's Latest News please visit Sakshi
No comments:
Post a Comment