ఓవైపు తరుముతున్న కరువు.. మరోవైపు అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థల మందగమ నం! వ్యవసాయరంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం.. అదేసమయంలో పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వక తప్పని పరిస్థితి..!! మరి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఇందు లో దేనికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు? రైతన్నలను ఎలా ఆదుకోనున్నారు? ఇన్వెస్టర్లలో భరోసా ఎలా నింపనున్నారు? ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఎలా ముందుకు వెళ్లనున్నారు..!! జైట్లీ వండబోయే బడ్జెట్ వంటకం రుచి ఎలా ఉండబోతున్నది? ఎవరెవరికి ఎంతెంత వడ్డింపులు ఉంటాయి? ఎంతమేరకు మినహాయింపులు ఉంటాయి? ఈ ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఎన్నో కోరికలు.. ఎన్నెన్నో ఆశలతో దేశ ప్రజలు సోమవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌వైపు చూస్తున్నారు.
Read For More News: visit Namaste Telangana ePaper
No comments:
Post a Comment