భారత్‌లోని కుబేరుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. ఈ ఏడాదికి ప్రపంచవ్యాప్త ధనికుల వివరాలతో ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన లిస్టులో మాత్రం ఆయనకు 36వ స్థానం దక్కింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పతనంతో దేశీయ స్టాక్ మార్కెట్లో ఈ రంగ షేర్లు భారీగా క్షీణించిన నేపథ్యంలోనూ 84 మంది భారతీయ అపర కుబేరుల జాబితాలో అగ్ర తాంబూలం ఆయనకే దక్కింది. ప్రపంచవ్యాప్త శ్రీమంతుల్లో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ టాప్ ప్లేస్‌లో నిలిచారు. ఆయన వ్యక్తిగత సంపద 7,500 కోట్ల డాలర్లుగా నమోదైంది. గత సంవత్సరంతో పోలిస్తే మాత్రం 420 కోట్ల డాలర్లు తగ్గింది. ఫోర్బ్స్ రిచ్ లిస్ట్‌లో గేట్స్‌కు నం.1 స్థానం దక్కడం వరుసగా ఇది మూడోసారి. ఈ 22 ఏండ్లలో 17సార్లు ఆయనే మొదటి స్థానంలో నిలిచారు. ఇక స్పానిష్ బిలియనీర్ అమాన్సియో ఓర్టెగాకు రెండో స్థానం దక్కగా.. ప్రముఖ ఇన్వెస్టర్, బెర్క్‌షైర్ హ్యాత్వే సీఈవో వారెన్ బఫెట్ మూడో స్థానంలో ఉన్నారు. మెక్సికన్ కుబేరుడు కార్లోస్ స్లిమ్‌కు 4వ, అమెజాన్ సీఈవో జెఫ్ బేజోస్‌కు 5వ స్థానాలు లభించాయి.
Read For More News: visit Namaste Telangana ePaper
No comments:
Post a Comment