ప్రపంచ సినీ ప్రేమికులు ఉత్కంఠగా ఎదురుచూసిన 88వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అమెరికా లాస్ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్లో ఆదివారం రాత్రి (భారతకాలమానం ప్రకారం సోమవారం ఉదయం) అట్టహాసంగా జరిగింది.ఎర్రతివాచీపై హాలీవుడ్ భామల తళుకుబెళుకుల నడుమ వేడుక ఆసాంతం కమనీయ దృశ్యాలకు వేదికగా నిలిచింది. హాస్యనటుడు క్రిస్రాక్ ప్రయోక్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి హాలీవుడ్ తారాలోకమంతా కదిలివచ్చింది. అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన మ్యాడ్మ్యాక్స్ ఆరు విభాగాల్లో అవార్డుల్ని కైవసం చేసుకొని అగ్రస్థానంలో నిలిచింది.
Read For More News: visit Namaste Telangana ePaper
No comments:
Post a Comment