Header Navigation

Thursday, March 10, 2016

త్రీ రోజెస్‌

వరంగల్‌ కార్పొరేషన్లు, మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గుబాళించింది. మూడు చోట్లా అత్యధిక స్థానాల్లో గెలుపొంది పీఠాలను కైవసం చేసుకున్నది. వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ రెబల్స్‌ గట్టిపోటీ ఇవ్వగా, అచ్చంపేటలో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఖమ్మంలో 50 డివిజన్లకు గానూ 34, గ్రేటర్‌ వరంగల్‌లో 58స్థానాలకుగాను 44, అచ్చంపేటలో 20 వార్డు లకు గాను మొత్తం వార్డుల్లో అధికార పార్టీ గెలుపొందింది. ఖమ్మం, వరం గల్‌లో కలిపి కాంగ్రెస్‌ 14 స్థానాల్లో గెలిచి ఉనికిని చాటుకోగా, సీపీఐ(ఎం) 3 స్థానాలు, సీపీఐకి 2 స్థానాల్లో ప్రాతినిధ్యం లభించింది. వైసీపీ 2, బీజేపీ ఒక స్థానంలో గెలుపొందాయి. ఇక టీడీపీ అడ్రస్‌ గల్లంతైంది. ఈ నెల 15న నగర మేయర్‌, డిప్యూటీ మేయర్లు, అచ్చంపేటలో చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక జరుగనుంది.
గ్రేటర్‌ వరంగల్‌లో...
వరంగల్‌లో 58 స్థానాల్లో పోటీ చేసిన టీఆర్‌ఎస్‌ 44 స్థానాల్లో విజయం సాధించింది. ఎనిమిది చోట్ల ఆ పార్టీ అభ్యర్థులను స్వతంత్ర అభ్యర్థులు కంగుతినిపించారు. వారంతా టీఆర్‌ఎస్‌ రెబల్స్‌ కావడం గమనార్హం. 49 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ నాలుగు స్థానాల్లో గెలుపొంది ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. 15వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మునారున్సీసాపై స్వతంత్ర అభ్యర్థి శారదా జోషి గెలుపొందారు. పోలింగ్‌ సందర్భంగా ఈమె భర్త సురేష్‌జోషీపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకొని ఇబ్బందులు పెట్టారు.

Read For More News: visit Nava Telangana ePaper