Header Navigation

Monday, March 14, 2016

విషవలయాన్ని ఛేదిస్తున్నాం..

తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం అంటేనే అంతర్రాష్ట్ర జల వివాదాలు.. ఒకవేళ వివాదాలు ఉంటే వాటిని మరింత జటిలం చేయడం.. పర్యావరణ సమస్యలు సృష్టించడం.. ఆదినుంచి సమైక్య రాష్ట్ర పాలకులు ఇలాంటి విషవలయాన్ని సృష్టించారు అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విమర్శించారు. సమైక్య పాలకులు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల చుట్టూ పన్నిన విషవలయం నుంచి బయటపడాలని.. నీళ్లను వీలైనంత ఎక్కువగా, సులభంగా తీసుకునే పద్ధతి తేవాలన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై ఆదివారం అసెంబ్లీలో జరిగిన చర్చకు సీఎం కేసీఆర్ సమాధానమిస్తూ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో సమైక్య రాష్ట్ర పాలకులు తెలంగాణకు చేసిన అన్యాయాలు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోతున్న ప్రాజెక్టులపై సుదీర్ఘంగా.. అనర్గళంగా మాట్లాడారు. కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వ్యవహరించిన తీరుపై ఆయన నిప్పులు చెరిగారు.

Read For More News: visit Namaste Telangana ePaper