బంగారు తెలంగాణ సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. 21 నెలల పాలనలో అనేక ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్ని పూర్తి చేశామని, భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభ సందర్భంగా గురువారం ఆయన ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉదయం 11 గంటల నుంచి 11.30 గంటల వరకు గవర్నర్ ప్రసంగం సాగింది. సభాపతి మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రతిపక్షనేత జానారెడ్డితో పాటు వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోదగ్గ పురోగతి సాధించిందని అన్నారు. ప్రతిపాదిత 8.6 శాతం జాతీయ వృద్ధి రేటుకుగానూ, స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) ముందస్తు అంచనాల ప్రకారం 2015-16లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ....
Read For More News: visit Nava Telangana ePaper
No comments:
Post a Comment