Header Navigation

Wednesday, March 30, 2016

గిన్నిస్ రికార్డ్స్ లో సుశీల

సుమధుర గాత్రంతో దక్షిణాది సంగీత ప్రియుల్ని దశాబ్దాల పాటు అలరించిన సుప్రసిద్ధ గాయని పి. సుశీల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. 56 ఏళ్ల సుధీర్ఘ స్వరప్రస్థానంలో ఆరు భాషల్లో కలిపి 17695 గీతాలను ఆలపించినందుకుగాను ఆమె ఈ ఘనతను దక్కించుకున్నారు.

తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాళీతో పాటు పలు భాషల్లో సుశీల ఎన్నో జనరంజకమైన గీతాలను ఆలపించారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి సుశీల ఇప్పటివరకూ 1300కుపైగా పాటలు పాటడం విశేషం.

Read For More News: visit Namaste Telangana online ePaper