Header Navigation

Wednesday, March 23, 2016

కంటతడి పెట్టిన డిప్యూటీ స్పీకర్ పద్మ

శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ చేశారంటున్న వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆ వ్యాఖ్యల మూలంగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి కంటతడి పెట్టారు. మంగళవారం కాంగ్రెస్ సభ్యుడు మల్లు భట్టివిక్రమార్క తన ప్రసంగాన్ని ముగించకపోవడంతో పలుమార్లు అవకాశం ఇచ్చి చివరకు స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి మైక్‌ను కట్ చేశారు. దీంతో తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని నిరసన వ్యక్తంచేస్తూ కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వెళ్లిపోతున్న తరుణంలో సంస్కారం లేనివారు సభను నడిపిస్తే ఇలాగే ఉంటుంది అని డీకే అరుణ వ్యాఖ్యానించినట్టు అధికార పార్టీ సభ్యులు ఆరోపించారు. మంత్రి హరీశ్‌రావు కూడా ఇదే విషయంలో అభియోగం మోపుతూ అరుణపై చర్యలకు పట్టుబట్టారు. సభ నుంచి బయటికి వెళ్లిన కాంగ్రెస్ సభ్యులను ప్రతిపక్ష నేత జానారెడ్డి మళ్లీ సభలోకి తీసుకొచ్చి పద్దులపై చర్చ సందర్భంగా మాట్లాడబోతుండగా కాసేపు డీకే అరుణ వ్యాఖ్యల వివాదం దుమారం లేపింది.

Read For More News: visit Namaste Telangana ePaper