రాష్ట్రపతిభవన్‌లో సోమవారం పద్మ అవార్డుల ప్రదానం వైభవంగా జరిగింది. వివిధ రంగాలకు చెందిన 56 మంది ప్రముఖులకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పురస్కారాల్ని అందచేశారు. రిలయన్స్ వ్యవస్థాపకుడు దివంగత ధీరుభాయ్ అంబానీ తరఫున ఆయన సతీమణి కోకిలాబెన్ పద్మవిభూషణ్‌ను అందుకున్నారు. కుమారులు ముకేష్ అంబానీ, అనిల్ అంబానీలతో పాటు కుటుంబసభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలుగువారైన ప్రముఖ కూచిపూడి నర్తకి యామినీ కృష్ణమూర్తి, అమెరికాకు చెందిన భారతీయ ఆర్థికవేత్త అవినాష్ కమలాకర్ దీక్షిత్, జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ జగ్మోహన్, శ్రీశ్రీ రవిశంకర్‌లు పద్మవిభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు.
Read For More News: visit Sakshi ePaper
No comments:
Post a Comment