దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) వివాదంలో ప్రధాన నిందితుడు జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యకుమార్ తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. దేశద్రోహం కేసులో అరెస్టయిన కన్హయ్యకుమార్కు ఢిల్లీ హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన ఆరు నెలల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసిన హైకోర్టు జాతి వ్యతిరేక కార్యక్రమాల్లో క్రియాశీలకంగా గానీ, పరోక్షంగా గానీ పాల్గొనకూడదు అని స్పష్టం చేసింది.
Read For More News: visit Namaste Telangana ePaper
No comments:
Post a Comment