Header Navigation

Wednesday, March 30, 2016

సీనియర్‌ నిర్మాత జయకృష్ణ కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన జయకృష్ణ మూవీస్‌ అధినేత జయకృష్ణ (67) మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. కొన్నేళ్ళ క్రితం కొడుకు ఆత్మహత్య చేసుకున్నారు. నేడు (బుధవారం) ఆయన అంత్యక్రియలు హైదరాబాద్‌లోనే జరుగుతాయని ఆయన సన్నిహితులు తెలిపారు. కె.జయకృష్ణ 1941 ఆగస్టు 18న పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తిలి సమీపంలో గల కోమర్రులో కాకిత సత్యనారాయణ, శేషమ్మలకు జన్మించారు. మేనమామ కూతురు కృష్ణవేణిని వివాహం చేసుకున్నారు. 1961లో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన మొదట వీనస్‌ స్టూడియోలో మేకప్‌ డిపార్ట్‌మెంట్‌లో అప్రెంటిస్‌గా చేరారు. కొన్ని రోజులకు కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌, లీలావతి నటించిన ఓ చిత్రానికి మేకప్‌ మ్యాన్‌గా పనిచేసి పారితోషికంగా 5 రూపాయలను అందుకున్నారు. తర్వాత బి.ఎన్‌ రెడ్డి రూపొందించిన 'రంగులరాట్నం' చిత్రానికి అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆయన పనితనాన్ని మెచ్చిన బి.ఎన్‌.రెడ్డి జయకృష్ణ పేరును 'జే.కే'గా మార్చారు. శోభన్‌బాబు నటించిన 'బంగారు పంజరం' (1969)తో మేకప్‌ చీఫ్‌గా మారారు.

Read For More News: visit Nava Telangana ePaper