Header Navigation

Friday, March 4, 2016

చక్రి తల్లి, సోదరుడి అరెస్టు

దివంగత సినీ సంగీత దర్శకుడు చక్రి ఆస్తి వివాదం మరో మలుపు తిరిగింది. గత మూడురోజులుగా హైదరాబాద్ సోమాజిగూడలోని వరుణ్ స్వర్గం విల్లా అపార్ట్‌మెంట్ వద్ద నిరసన దీక్ష చేపట్టిన చక్రి తల్లి జిల్లా విద్యావతి, సోదరుడు మహిత్ నారాయణ్‌ను నాటకీయ పరిణామాల మధ్య గురువారం రాత్రి 11 గంటలకు పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఈ అరెస్టు వెనుక ప్రస్తుతం తమ ఫ్లాట్ నం. 504ను ఆక్రమించుకున్న అట్లూరి మాధవి హస్తముందని మహిత్ ఆరోపించారు. దీని వెనుక ఎవరెవరున్నారో త్వరలోనే బయటపెడతామని చెప్పారు. తమ ఇంటిని దక్కించుకునే వరకు న్యాయపోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.

Read For More News: visit Namaste Telangana ePaper