జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్..దేశీయ మార్కెట్లోకి బుల్లెట్‌ప్రూఫ్ కారును విడుదల చేసింది. మేబ్యాక్ ఎస్ 600 గార్డ్ పేరుతో విడుదల చేసిన ఈ కారు ఢిల్లీ షోరూంలో రూ.10.5 కోట్లకు లభించనున్నది. బాలిస్టిక్ భద్రత ప్రమాణాలైన వీఆర్10 లోబడి ఈ కారును దేశీయం తయారుచేసింది. టెక్నాలజీపరంగా, అధిక భద్రత కలిగిన ఈ సెగ్మెంట్లో మేబ్యాక్ ఎస్ 600 నూతన శకానికి శ్రీకారం చుట్టనుందని మెర్సిడెజ్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో రోలాండ్ ఫోల్గర్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేసిన పక్షం రోజుల తర్వాత దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టినట్లు ఆయన ప్పారు.
వీఆర్ 10 సర్టిఫికేషన్ మార్గదర్శకాలకు లోబడి ఈ కారును తయారు చేసినట్లు, ముఖ్యంగా స్టీల్ కోర్ కోటింగ్‌తో బుల్లెట్ వర్షం కురిపించినప్పటికీ ఈ కారు లోపలో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగదని తెలిపింది.
వీఆర్ 10 సర్టిఫికేషన్ మార్గదర్శకాలకు లోబడి ఈ కారును తయారు చేసినట్లు, ముఖ్యంగా స్టీల్ కోర్ కోటింగ్‌తో బుల్లెట్ వర్షం కురిపించినప్పటికీ ఈ కారు లోపలో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగదని తెలిపింది.
Read For More News: visit Namaste Telangana ePaper
No comments:
Post a Comment