జ్వరం, జలుబు, దగ్గు లాంటి వ్యాధుల బారిన పడితే.. వైద్యులను కూడా సంప్రదించకుండా వినియోగించే క్రోసిన్, డీ కోల్డ్ టోటల్, ఫ్లూ, ఓఫ్లాక్స్, విక్స్ 500, కోరెక్స్ లాంటి ఔషధాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఔషధాల వినియోగం దుర్వినియోగం అవుతున్నద ని, ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతున్నదని భావించిన కేంద్ర ప్రభుత్వం.. పలు రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ డ్రగ్స్ (ఎఫ్డీసీ) ఉత్పత్తులపై, అమ్మకాలపై ఆంక్షలు విధించింది. మాయదారి రోగాలకు కారణమవుతున్న 350 రకాల మాత్రలపై నిషే ధం ఈ నెల 12న విధిస్తూ ఓ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో నాసివియాన్, సుమో, గ్యాస్ట్రోజైల్, చెరికాఫ్, నిములిడ్, కాఫ్నిల్, డోలో, డెకాఫ్, ఓ2, పిల్లలకు ఉపయోగించే టానిక్ టీ-28, డెడీకాఫ్ లాంటి ఔషధాలు ఉన్నాయి. ఈ ఔషధాల కాంబినేషన్ సామర్థ్యాన్ని పరిశీలించాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
Read For More News: visit Namaste Telangana ePaper
No comments:
Post a Comment