మరో విడత భారీగా సర్కారీ కొలువుల భర్తీకి రంగం సిద్ధమవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలు, వైద్యశాఖలో 4,844 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పచ్చజెండా ఊపారు. గురుకులాల్లో ఖాళీగా ఉన్న 2,444 పోస్టులను, వైద్యశాఖలో 2,400 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇందుకు టీఎస్పీఎస్సీకి బాధ్యత అప్పగించారు. తన క్యాంపు కార్యాలయంలో బుధవారం వైద్యారోగ్యశాఖపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. తమిళనాడు ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నారని, ఆ తరహా సేవలు రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ తివారీ, కమిషనర్ బుద్ధప్రకాశ్ మరోసారి తమిళనాడులో పర్యటించి అక్కడి చట్టాలను సమగ్రంగా అధ్యయనం చేయాలని, వాటిలో అత్యుత్తమం అనుకున్నవాటిని రాష్ట్రంలో అమలు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Read For More News: visit Namaste Telangana online ePaper
No comments:
Post a Comment