ఊపిరి సినిమాలో నటించడం వల్ల నాలో మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎన్నో మార్పులొచ్చాయి. మందు శరీరానికే కానీ మనసుకు కాదని అర్థమైంది. హృదయానికి హత్తుకునే సన్నివేశాలెన్నో ఈ సినిమాలో వున్నాయి. ఆశావహ దృక్పథం అలవర్చుకుంటే జీవితంలో ఏదైనా సాధించవొచ్చనే గొప్ప సందేశం మేళవించిన చిత్రమిది. ఈ సినిమా ద్వారా జీవితం విలువ, స్వేచ్ఛ విలువ ఏమిటో తెలుసుకోగలిగాను. ఈ సినిమాలో హీరోలు, స్టార్స్ లేరు. కేవలం పాత్రలే కనిపిస్తున్నాయి అన్నారు నాగార్జున. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఊపిరి చిత్రం ఇటీవలే విడుదలై చక్కటి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటోంది. ఈ మధ్యనే వీల్‌ఛెయిర్ ఫ్రెండ్స్‌తో చిత్ర బృందం హైదరాబాద్‌లో చిట్‌చాట్ జరిపింది.
Read For More News: visit Namaste Telangana online ePaper
No comments:
Post a Comment