Header Navigation

Monday, April 11, 2016

ఆ సమయంలో నాతో సినిమా చేసేవారు ఎవరూ లేరు!

నేను సెలబ్రిటీని కాదు. కేవలం నటుడిని మాత్రమే. మరొకరిని ప్రభావితం చేసేంతా గొప్ప పనులు ఏమీ చేయలేదు. నాకంటే దేశాన్ని ప్రభావితం చేసే ఉన్నతమైన వ్యక్తులు ఉన్నారు. నన్ను చూసి రెండు చప్పట్లు కొడతారు, ఈలలు వేస్తారు. అంతకుమించి నా ప్రభావమేదీ ఇతరులపై ఉండదనుకుంటున్నాను అన్నారు పవన్‌కల్యాణ్. తెలుగు సినీ పరిశ్రమలో పవన్‌కల్యాణ్‌ది ఓ ప్రత్యేకస్థానం. జయాపజయాలకు అతీతంగా తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారాయన. పవన్‌కల్యాణ్ నటించిన తాజా చిత్రం సర్దార్ గబ్బర్‌సింగ్ ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ నమస్తే తెలంగాణతో ప్రత్యేకంగా సంభాషించారు.

పవన్‌కల్యాణ్ సినిమా అంటేనే అంచనాలు భారీగా ఉంటాయి. సర్దార్ గబ్బర్‌సింగ్‌కు మరింత హైప్ క్రియేట్ చేయడానికి కారణమేంటి?


రెండున్నర ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో ప్రచారంలో జాగ్రత్తలు తీసుకున్నాం. అందుకు తగ్గట్టుగా సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాటికి మా సినిమా అందుకోవడం ఆనందంగా ఉంది.

Read For More News: visit Namaste Telangana Newspaper