Header Navigation

Tuesday, April 12, 2016

రెండోసారి ఉత్తమ నటిగా...

వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన ప్రియాంక చోప్రా ఉత్తమ నటిగా మరోమారు దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని దక్కించుకుంది. 'బాజీరావు మస్తానీ' చిత్రంలోని ఉత్తమ నటనకు ప్రియాంక ఈ పురస్కారానికి ఎంపికైంది. దాదాసాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫౌండేషన్‌ ప్రతి ఏటా ఈ అవార్డుని అందిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది ప్రియాంకను ఈ అవార్డు వరించింది. 2011లో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందిన 'సాత్‌ ఖూన్‌ మాఫ్‌' చిత్రంలోని ఉత్తమ నటనకు ప్రియాంక తొలిసారి దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుకి ఎంపికయ్యారు. దాదా సాహెబ్‌ ఫాల్కే 147వ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్‌ 24వ తేదీన ముంబైలో నిర్వహించే పురస్కార ప్రదానోత్సవంలో ప్రియాంక ఈ అవార్డుని అందుకోనున్నారు. ప్రియాంక చోప్రా ప్రస్తుతం 'బేవాచ్‌' హాలీవుడ్‌ చిత్రంలో నటిస్తున్నారు.

Read For More News: visit Nava Telangana Online ePaper