పాలు.. మనిషి జీవితంతో విడదీయరాని అనుబంధం ఏర్పర్చుకున్న అమృతం! మన శరీర ఆరోగ్యానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్ లభ్యమయ్యేది పాలలోనే! దేహాన్ని దృఢంగా మార్చడంలో కీలకపాత్ర పోషించే ప్రొటీన్లకు కేరాఫ్ అడ్రస్ పాలు! ఎండలో తప్ప ఇంకెక్కడా దొరకని విటమిన్ డీ పుష్కలంగా దొరికేదీ పాలలోనే! ఎదిగే పిల్లలకు, మహిళలకు అవసరమయ్యే కాల్షియం అధికమొత్తంలో అందించే శక్తి ఉన్నది పాలకే! పసి పిల్లల సమగ్ర పెరుగుదలకు అవసరమైన పోషకాలన్నీ గుదిగుచ్చినట్టు ఉండేది కూడా పాలలోనే! ఆ మాటకొస్తే పసికందులకు మొదటి ఆరు నెలలు పాలే సంపూర్ణ ఆహారం!
కానీ.. ఈ రోజుల్లో మనం తాగే పాలలో ఏమేం ఉంటాయో తెలుసా? మన శరీరంలోకి ఈ-కొలీ బ్యాక్టీరియాను ప్రవేశపెట్టే అపరిశుభ్రమైన నీళ్లు ఉన్నాయి! పాలను చిక్కగా కనిపించేలా చేసేందుకు.. పంటలకు వేసే యూరియా ఉంది! ఉప్పుంది.. బట్టలుతికే సర్ఫ్ ఉంది.. వేరుసెనగ పిండి ఉంది.. సోడియం హైడ్రాక్సైడ్ ఉంది.. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంది.. సోడియం కార్బొనేట్ ఉంది! మొదట చెప్పినవన్నీ మనిషిని ఆరోగ్యవంతునిగా తీర్చిదిద్దేవైతే.. మనకు తెలియకుండా మనం తాగే పాలల్లో కలుస్తున్నవి మన దేహాన్ని, దేహంలోని కీలక అవయవాలను.. మనిషి ఎదుగుదలను.. మన పిల్లల మనోవికాసాన్ని పగబట్టినట్టు పాడుచేసేవి!!

Read For More News: visit Namaste Telangana ePaper
No comments:
Post a Comment