ఏమాత్రం కష్టపడకుండా.. అత్యంత సులభంగా.. ఎవరికీ తెలియకుండా కల్తీ చేసేందుకు అవకాశం ఉన్నది బియ్యం! దీనికి బొక్కల నూనె తయారు చేసినట్టుగా ఎత్తయిన గోడలుండే కార్ఖానాలక్లర్లేదు.. పాలను కల్తీ చేసేలా పెద్ద వ్యవస్థ కూడా ఉండాల్సిన అవసరం లేదు! మట్టి పెళ్లలు.. దుబ్బ.. ఊక.. నాసిరకం బియ్యం! ఈ నాలుగూ ఉంటే చాలు.. గల్లా పెట్టె గలగలలే!! ఈ లాభాలను ఇంకొంచెం పెంచేందుకు తూకంలో అన్యాయం.. ప్యాకింగ్‌లో మోసం! అవిసరిపోవంటే.. చైనా నుంచి రంగప్రవేశం చేశాయ్.. ప్లాస్టిక్ రైస్!!దేశంలోని చాలా రాష్ర్టాల్లో ఎవర్గ్రీన్ బిజినెస్ ఏదైనా ఉందంటే.. అది బియ్యం! ఏది ఉన్నా లేకున్నా కాసిన్ని బియ్యం ఉంటే చాలు.. పప్పో పచ్చడో అవీ లేకుంటే పచ్చిపులుసో.. ఆ పూట గడిచిపోవడానికి!! అందుకే బియ్యానికి అంత డిమాండ్! అంతటి డిమాండ్ ఉంది కనుకే బియ్యం వ్యాపారానికి అంత ఫుల్లు గిరాకీ! ఈ గిరాకీని పెంచుకోడానికి కక్కుర్తిపడుతున్న వ్యాపారులు జనం ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. అత్యంత సాధారణంగా బియ్యం కల్తీ అయ్యేది మట్టిపెళ్లలు, ఊక, నూకలు వంటివాటితో. వీటిని కలుపడం ద్వారా ఐదు నుంచి పదిశాతం బస్తా బరువు పెంచుతున్న వ్యాపారులు.. ఆ మేరకు లోపల బియ్యాన్ని కాజేస్తున్నారు.
Read For More News: visit Namaste Telangana online ePaper
No comments:
Post a Comment