Header Navigation

Monday, April 25, 2016

నిజాలు తెలిశాయి!

వ్యక్తిగత, వృత్తి జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాల్ని చవిచూశానని, ఈ ప్రయాణంలో జీవన సత్యాల్ని తెలుసుకున్నానని చెప్పింది మలయాళ సుందరి నయనతార. ప్రస్తుతం స్క్రిప్ట్‌లను ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నానని, బాధలన్ని మరచిపోయి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నానని తెలిపింది. ప్రభుదేవాతో విఫల ప్రేయాయణం తర్వాత నయనతార కెరీర్ ముగిసిపోయిందని అనుకున్నారు.

అయితే అందరి అంచనాల్ని తలక్రిందులు చేస్తూ తిరిగి విజయాల బాట పట్టింది ఈ సొగసరి. ప్రస్తుతం ఆమె పలు భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. ఈ సందర్భంగా నయనతార మాట్లాడుతూ మనం సక్సెస్‌లో వున్నప్పుడు ప్రతి ఒక్కరూ పొగడ్తలతో ముంచెత్తుతుంటారు. మీడియా వారు కూడా పాజిటివ్‌గా వార్తలు రాస్తారు. ఫెయిల్యూర్స్ మొదలవగానే అంతకాలం పక్కనున్న వాళ్లందరు తప్పుకునే ప్రయత్నం చేస్తారు. బాగా తెలిసిన వారు కూడా మనమెవరో తెలియనట్టే నటిస్తారు.

Read For More News: visit Namaste Telangana Newspaper