ఇదే నా చివరి హెచ్చరిక.. ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 30వ తేదీలోగా మిషన్ కాకతీయ మొదటిదశ పనులు పూర్తిచేయాలి. పనుల్లో ఏమాత్రం జాప్యంచేసినా కఠినచర్యలు ఉంటాయి అని భారీ సాగునీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మిషన్ కాకతీయ పనులపై మంగళవారం సచివాలయం నుంచి ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మిషన్ కాకతీయ పనుల్లో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. పనులు వేగంగా జరగాలని, ఎక్కడ జాప్యం జరిగినా సహించేది లేదని హెచ్చరించారు. జాప్యానికి బాధ్యులైనవారిపై విచారణ జరిపి కఠినచర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. మిషన్ కాకతీయపై తిరిగి ఈ నెల 13న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని తెలిపారు.
Read For More News: visit Namaste Telangana online Newspaper
No comments:
Post a Comment