Header Navigation

Monday, April 11, 2016

వైజాగ్‌లో స్థిరపడతా..

‘‘రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగు సినిమా అభివృద్ధి చెందాలి. ‘సరైనోడు’ సినిమా వేడుక  వైజాగ్‌లోనే చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు పట్టుబట్టారు. అయితే ప్రభుత్వం మాటలతో కాకుండా, చేతల్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి మౌలిక సదుపాయాలను కల్పించాలి’’ హీరో చిరంజీవి అన్నారు. అల్లు అర్జున్, రకుల్ ప్రీత్‌సింగ్, క్యాథరిన్ థెరెస్సా ముఖ్యతారలుగా గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన చిత్రం ‘సరైనోడు’. ఈ చిత్రం పాటల విజయోత్సవం ఆదివారం వైజాగ్‌లోని సముద్ర తీరంలో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ, ‘‘వైజాగ్‌తో నాది ప్రత్యేక అనుబంధం. రిటైరయ్యాక, వైజాగ్‌లో స్థిర నివాసం ఏర్పరచుకుంటాను.

ఇక, నాకు రామ్‌చరణ్ ఎలాగో బన్నీ కూడా అంతే. చిన్నతనం నుంచి సరదాగా డ్యాన్సులు వేసే బన్నీ కోసం ‘డాడీ’ సినిమాలో ఓ క్యారెక్టర్   సృష్టించి, అతని  తెరంగేట్రానికి బీజం వేశానని గర్వంగా చెప్పుకుంటా.  దర్శకుడు బోయపాటి శ్రీను నాకు ‘అన్నయ్య’ సినిమా టైమ్ నుంచి తెలుసు. అతనిలో ఉన్న  అంకిత భావమే ఈ స్థాయికి చేర్చింది. నాకు అంతకు ముందు ‘సింహా’, లెజెండ్’ కథలు చెప్పినప్పుడు ఏవో కొన్ని మార్పులు సూచించాను. కానీ ‘సరైనోడు’ కథ చెప్పినప్పుడు మారు మాట్లాడలేదు. ఈ చిత్రానికి అతను సరైన డెరైక్టర్’’ అని వ్యాఖ్యానించారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ-‘‘ ఈ సినిమా మీ అంచనాలకు రీచ్ అవుతుందన్న నమ్మకం ఉన్నా దడగా ఉంది.

Read For More News: visit Sakshi Online ePaper