హెడ్డింగ్ చూసి ఇది అంకెల మధ్య పోటీ అనుకుంటున్నారా. కాదు. ఇద్దరు అగ్ర కథానాయకుల మధ్య పోటీ ఇది. తొమ్మిదేళ్ల విరామం తర్వాత రీఎంట్రీ ఇస్తోన్న చిరంజీవి, శతాధిక చిత్రాల జాబితాలో అడుగుపెడుతోన్న బాలకృష్ణ తమ సినిమాలతో పోటీపడబోతున్నారు. తమ సుధీర్ఘ నట జీవితంలో ఎన్నో విజయాల్ని సొంతం చేసుకున్న ఈ స్టార్ హీరోల కెరీర్లో మైలురాయిగా భావిస్తున్న ఈ చిత్రాలు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. చిరంజీవి రీఎంట్రీ కోసం దాదాపుగా రెండేళ్లుగా నెలకొన్న ఉత్కంఠకు ఇటీవలే తెరపడింది.
తొమ్మిదేళ్ల విరామం తర్వాత కత్తి రీమేక్‌తో తిరిగి వెండితెరపై అడుగుపెట్టనున్నారాయన. చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రమిది కావడం విశేషం. ఈ సినిమాతో చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ నిర్మాతగా అవతారమెత్తారు. ఈ రీమేక్‌కు వి.వి. వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర పూజా కార్యక్రమాల్ని నిర్వహించారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలో భారీ మార్పులు చేసినట్లు తెలిసింది.

Read For More News: visit Namaste Telangana Newspaper
No comments:
Post a Comment