పందెంకోడి చిత్రంతో తెలుగు, తమిళ భాషల్లో మాస్ హీరోగా గుర్తింపు పొందారు విశాల్. స్వతహాగా తెలుగువాడైన ఆయన రెండు భాషల్లోనూ మాస్ ప్రేక్షకుల్ని అలరిస్తూ సత్తాచాటుతున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం రాయుడు. ముత్తయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా విశాల్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలవి.
పందెంకోడి...వాడువీడు తరువాత...
పందెంకోడి...వాడువీడు తరువాత...
ముత్తయ్య మంచి మాస్ దర్శకుడు. ఇంతకు ముందే నాతో సినిమా చేయాల్సింది. కొన్ని కథలు చెప్పారు కూడా. అయితే కొన్ని కారణాల వల్ల కలిసి చేయలేకపోయాం. ఇప్పటికి కుదిరింది. ప్రేక్షకులు నన్ను ఇష్టపడే విధంగా ఈ చిత్రంలో చూపించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రమిది. నానమ్మకు, మనవడికి మధ్య సాగే కథ. సినిమాలో నానమ్మ పాత్రే కీలకం. ఆ పాత్రలో మలయాళ నటి నటించింది. మార్కెట్లో బస్తాలు మోసే మాస్ పాత్రలో కనిపిస్తాను. పందెంకోడి, వాడు వీడు చిత్రాల తరువాత పూర్తిస్థాయి గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రమిది. నా పాత్ర చాలా మాస్‌గా, గడ్డం, టాటూలతో కొత్తగా ఉంటుంది.
Read For More News: visit Namaste Telangana Newspaper
No comments:
Post a Comment