Header Navigation

Thursday, May 19, 2016

విరాట్ జిగేల్

ఎవరు ఆపగలరు విరుచుకుపడే సునామీని.. ఎవరు ఆపగలరు భూ ప్రళయాన్ని.. ఎవరు ఆపగలరు ప్రచండాగ్నిని .. ఇంతవరకు మనం ప్రకృతి వైపరీత్యాలను మాత్రమే ఆపలేం అనుకుంటున్నాం.. ఇప్పుడు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూస్తుంటే.. ఎవరు ఆపగలరు కోహ్లీ పరుగుల వేటను అని అనక తప్పదేమో! ఓవర్లు 50 ఐనా.. 20 ఐనా.. 15 ఐనా సెంచరీలు బాదేస్తుంటే బౌలర్లంతా ఇలాగే అనుకుంటారు మరి. టీ20 మ్యాచ్‌లో ఒక సెంచరీ చేయడమే గొప్ప అనుకుంటే మంచినీళ్లు తాగినంత ఈజీగా సెంచరీల మీద సెంచరీలు కొడుతుంటే అనుకోవచ్చు ఎవరు ఆపగలరు విరాట్‌ను. ఒకే సీజన్‌లో నాలుగు సెంచరీలు.. బౌలర్ బంతి వేస్తే బౌండరీ, లేదంటే సిక్సర్, ఇంతలా ఐపీఎల్‌లో చెలరేగుతున్నాడు. అదీ జట్టు వరుసగా పరాజయాల బాటపట్టిన సమయంలో, చేతికి గాయమై 10 కుట్లు పడినా, వర్షం అంతరాయంతో ఓవర్లు కుదించినా, సెంచరీని మాత్రం వదలనంటాడు. వావ్.. ఈ మ్యాచ్‌లో ఏమా ఇన్నింగ్స్.. ఏమా బ్యాటింగ్.. 12 ఫోర్లు.. 8 సిక్సర్లు.. అందుకే ఎవరు ఆపగలరు కోహ్లీ పరుగుల విలయాన్ని! ఎవరు ఆపగలరు కోహ్లీ సెంచరీలను.. ఎవరాపగలరు కోహ్లీ దా జవాబ్ నహీ!

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కసితీరింది! ప్రత్యర్థి జట్లు ఎంత పటిష్ఠమైనా ప్లేఆఫ్‌కు చేరుకోవడమే లక్ష్యంగా చెలరేగిన బెంగళూరు అనుకున్నది సాధించింది. వరుస విజయాల జోరును కొనసాగిస్తూ పంజాబ్‌తో కీలకమైన మ్యాచ్‌లో బెంగళూరు జూలు విదిల్చింది. తన అప్రతిహత ఫామ్‌ను అద్వితీయంగా కొనసాగిస్తూ కోహ్లీ మరో సెంచరీతో విరుచుకుపడడంతో బెంగళూరు భారీ స్కోరు సాధించింది. భారీ లక్ష్యఛేదనలో బెంగళూరు బౌలింగ్ ముందు మోకరిల్లిన పంజాబ్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బెంగళూరు: బెంగళూరు విజయ పరంపర కొనసాగుతూనే ఉంది. తమకు ఎంతో అచ్చొచ్చిన సొంతగడ్డ చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు మరో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.

Read For More News: visit Namaste Telangana Newspaper