Header Navigation

Tuesday, May 24, 2016

హైదరాబాద్‌కు ఐకియా

ఎల్మ్‌హుల్ట్(స్వీడన్) నుంచి శ్రీధర్ సూరునేని: సుప్రసిద్ధ అంతర్జాతీయ గృహోపకరణాల సంస్థ ఐకియా భారత్‌లో తన తొలి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభిస్తున్నది. రూ.600 కోట్ల పెట్టుబడితో గచ్చిబౌలిలోని 13 ఎకరాల స్థలంలో భారీ స్టోర్‌ను ఏర్పాటు చేస్తున్నది.

త్వరలోనే ఇందుకు సంబంధించిన భూమిపూజ జరుగనుంది. 45దేశాల్లో 385 స్టోర్లతో 10వేల వివిధ రకాల గృహోపకరణాలను ఐకియా తన స్టోర్ల ద్వారా విక్రయిస్తుంది. స్వీడన్ నుంచి ప్రస్థానాన్ని ప్రారంభించిన ఐకియా అనతికాలంలోనే విస్తరించి ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న గృహోపకరణాల సంస్థగా గుర్తింపు పొందింది. హైదరాబాద్‌లో స్టోర్‌ను ఏర్పాటు చేస్తున్న సందర్భంగా ఈ సంస్థ తమ వ్యాపార వివరాలను వెల్లడించేందుకు పాత్రికేయుల బృందాన్ని స్వీడన్‌కు తీసుకెళ్లింది. తమ ఫ్యాక్టరీలు, వ్యాపార సముదాయాలు, గోదాముల సందర్శనలతో పాటు ఐకియా ఉత్పత్తుల వినియోగదారులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసింది. 

అగ్గిపెట్టె తయారీ నుంచి...
ఈ రోజు కంటే రేపు మరింత బాగుండాలి ఇది ఐకియా సంస్థ నినాదం. దీనికి తగ్గట్టే చాలా సాధారణ జీవితం నుంచి వచ్చిన ఇంగ్వార్ కాంప్రాడ్ ఐకియాకు వ్యవస్థాపకుడు. తన పదిహేడో ఏట అగ్గిపెట్టెలతో వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత పాలడబ్బాలు, కట్టెలు, ఇతర ఇనుప సామాగ్రి సిద్ధం చేయడం మొదలుపెట్టారు. 1943 నుంచి సాగిన ప్రస్థానానికి 1953లో స్టోర్ రూపాన్ని ఇచ్చారు.

Read For More News: visit Namaste Telangana Newspaper

No comments:

Post a Comment